MachilipatnamLocal News
March 30, 2026
జిల్లా

డిఇఓ పదవ తరగతి పరీక్ష కేంద్రాలు తనిఖీ

  • March 23, 2026
  • 0 min read
[addtoany]
డిఇఓ పదవ తరగతి పరీక్ష కేంద్రాలు తనిఖీ
 మచిలీపట్నం :
 
       సోమవారం పదవ తరగతి గణిత పరీక్షల సందర్భంగా కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈవో జడ్పీహెచ్ఎస్ ఆర్తమూరు, బంటుమిల్లి మండలం, సిపిఎం హై స్కూల్, చిలకలపూడి (మచిలీపట్నం), సెయింట్ జాన్స్ హై స్కూల్, మచిలీపట్నం, నిర్మల హై స్కూల్, మచిలీపట్నం, కేకేఆర్ గౌతమ్ హై స్కూల్, మచిలీపట్నం, హైని హై స్కూల్ ఇలా పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పరిశీలించారు.                 అదే విధంగా నిర్మల హై స్కూల్, మచిలీపట్నం లో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మొత్తం 7 పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన అనంతరం పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్ల పై అవసరమైన సూచనలు చేశారు. అలాగే డిఇఓ జడ్పీహెచ్ఎస్ ఆర్తమూరు లో డ్యూటీలో ఉన్న ఏఎన్ఎం లు కల్పించిన మెడికల్ సదుపాయాలను కూడా పరిశీలించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *