మచిలీపట్నం:
ఉగాది తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని, మంచి పనులను ఉగాదినాడే శ్రీ కారం చుట్టాలని డీఎస్పీ కె ధర్మేంద్ర అన్నారు. మానవతా స్పఛ్ఛంద సేవా సంస్థ ఆధ్యర్యంలో సన్ స్టార్ స్కూలులో బుధవారం వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సభలో డీఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని వివిధ రంగాల్లోని ప్రముఖులకు అవార్డులను అందజేశారు.
విద్యావేత్త దిట్టకవి వెంకటేశ్వరరావు, సిరికవి డా. చింతలపాటి మురళీకృష్ణ, ఎఎంవో రెడ్రొతు శ్యామ సుందర రావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు వేమూరి వాణి, బాలాజీ విద్యాలయం కరస్పాండెంట్ కొమరగిరి చంద్రశేఖర్, అంతర్జాతీయ అథ్లెటెక్స్ విన్నర్ బండి విధ్యారేఖ, ప్రముఖ సంగీత విద్యాంసురాలు కాళీపట్నపు ఉమ, సప్తశత అవార్డుల గ్రహీత పన్యారపు సాంబశివరావు, ప్రముఖ కవయిత్రి ఓలేటి ఉమాసరస్వతి, భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కారుమూరి రాజేంద్ర ప్రసాద్, మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డా. పొన్నం తేజస్విని, బాడీబిల్డర్ బీరం ప్రశాంత్ లకు ఉగాది పురస్కారాలు అందజేశారు.
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిఎస్పీ ధర్మేంద్ర, బ్రాహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ పి.వి. ఫణికుమార్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మానవత విద్యానిధి కన్వీనర్ పి శ్రీరాం, జిల్లా కో కన్వీనర్ ముదిగొండ శాస్త్రి, ఉపాధ్యక్షుడు బొమ్మిడి స్వామి, ఆదిత్య తదితరులు మాట్లాడారు.