జిల్లా కలెక్టర్ బాలాజీని స్ఫూర్తిగా తీసుకుందాం….. జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్
మచిలీపట్నం :
జిల్లాలోని పాఠశాలల్లో నిర్వహస్తున్నయోగ శిక్షగా తరగతులను రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేందు కు ఉపాధ్యాయులు, యోగ ఇన్స్ట్రక్టర్లు కు సహకరించాలని జిల్లా స్పోర్ట్స్ ఆఫీసరు ఝాన్నలక్షి అన్నారు. బందరు మండలం పోతేపల్లి హై స్కూల్లో నిర్వహిస్తున్న ఉచిత యోగ శిక్షణా కార్యక్రమాలను ఝానీ లక్ష్మి సందర్శించారు. యోగమాస్టర్ డా. మల్లికార్జునుడు విద్యార్థులతో సూర్యనమస్మారాలు చేయించారు. విద్యార్థులతో వృక్షాసనం, మకరాసనాలు వేయించారు. ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ ఝాన్సీ మాట్లాడుతూ, జిల్లాల 28 పాఠశాలల్లో ప్రతి గురువారం ఉచితంగా యోగ శిక్షణా తరగతులు నిర్వహిస్తూన్నామన్నారు.
జిల్లాలో 32 పీఎం శ్రీ పాఠశాలలో ప్రతిరోజు యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిరోజు యోగా సాధన చేస్తూ ఉపాధ్యాయులకు ,యోగ ఇన్స్ట్రక్టర్లకు వ్యాయామ ఉపాధ్యాయులకు స్ఫూర్తినిస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగ గురువులు ముదిగొండ శాస్త్రి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.