మరణానంతరం కూడా సౌకర్యాల కల్పన అభినందనీయం
కాటం వెంకట్రావు రీజినల్ హెడ్, యూనియన్ బ్యాంక్
మచిలీపట్నం :
మనిషి మరణానంతరం కూడా సకల సౌకర్యాలతో పార్దివ దేహానికి కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా నిర్వహించుకొందుకు వీలుగా, నిర్వాహకులు “స్వర్గపురి” లో ఏర్పాట్లు చేయడం అభినందనీయమని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ కాటం వెంకట్రావు అన్నారు.
మూడు స్తంభాల సెంటర్ సమీపంలో శ్రీ అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నందు గురువారం పార్థివ దేహ విశ్రమాలయప్రారంభోత్సవాన్ని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ కాటం వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ స్వర్గపురి నిర్మిత పార్థివ దేహ విశ్రమాలయం
సమాజమునకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బయటి ఊరి నుండి వచ్చి వెంటనే మరణానంతర విధులు, కార్యక్రమాలు నిర్వహించ లేని వారు, అద్దె గృహాలలో నివసించు వారికి, ఇతర దేశములలో నివసించు పిల్లల రాక కోసం వేచి చూడ వలసిన వారికి, పార్థివ దేహ విశ్రమాలయం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నగరంలో ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన దాతలను అభినందిస్తూ తమ యూనియన్ బ్యాంకు నుండి విశ్రమాలయానికి ఏసీ నిమిత్తం 75 వేల రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా మరణానంతర విధులు కూడా నిర్వహించుటకు కావలసిన సౌకర్యాలు, సదుపాయములతో, కుల మత రహితముగా జరుపు కొనుటకు, ఏర్పాట్లు కలిగి ఉండడం అభినందనీయమన్నారు. నూతన నిర్మిత నిర్మాణమును తన చేతుల మీదుగా నిర్వహించడం తాను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలం అన్నారు. దాతల దాతృత్వంతో ఈ స్వర్గపురిని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమములో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసిస్టెంట్ రీజియనల్ హెడ్ ఉమా రామ లింగా రెడ్డి, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ రామ్ చరణ్ తేజ, గది నిర్మాణ సహకారం అందించిన దాతలు, గుడివాడ సోమేశ్వర రావు, శిర్విసెట్టి భాస్కర్ లు, ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు దోరడ్ల హేమ ప్రకాష్, కార్యదర్శి గుడివాడ మెహెర్ ప్రసాద్, కోశాధికారి ఉడత్తు దుర్గా ప్రసాదరావు, , ఉప కార్యదర్శి వాకమల్లు శ్రీనివాస రావు,కమిటీ సభ్యులు అన్నం రామకృష్ణ బాబు రావు, కొప్పర్తి రవి శంకర్, పాలకుర్తి శరత్ కుమార్ తదితరులు గౌరవ ఆహ్వానితులు రాళ్ళబండి రాజారం, కేఆర్ కేఎం మాస్టారు, లంక గంగాధర్, గుడివాడ రవికుమార్, ఉదయగిరి సతీష్, పాలకుర్తి గిరి, తమ్మన నారాయణ రావు, ఊర రామాంజనేయులు పాల్గొన్నారు.