మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ చోడే వీర వెంకట సత్య బాపిరాజు ఆదేశాల మేరకు, నగరాన్ని శుభ్రంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘స్వచ్ఛోత్సవ్ 2026’ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు . ఇందులో భాగంగా బుధవారం స్థానిక నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చెత్త విభజన (సోర్స్,సిగ్రెగేషన్ ) పరిశుభ్రతపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, సమాజం పట్ల వారికి ఉన్న బాధ్యతను గుర్తు చేశారు. కేవలం పరిసరాల పరిశుభ్రత మాత్రమే కాకుండా, వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ , హైజీన్) పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. ముఖ్యంగా చేతులు కడుక్కోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వంటి అంశాలపై విద్యార్థులకు కీలక మెలకువలు నేర్పించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ యం. గోపాల్ రావు , 45 వ డివిజన్ ఇంచార్జ్ ఫణి , సానిటరీ ఇన్‌స్పెక్టర్లు శివ ప్రసాద్ , మహేష్ , శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు , ఐఇసి టీమ్ సభ్యులు శ్రీకాంత్ పాల్గొని చెత్త నిర్వహణపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. తడి, పొడి, హానికరమైన వ్యర్థాలు ,ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్) చెత్తను ఇంటి వద్దే వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వారు వివరించారు. ఏ రకమైన వ్యర్థాలను ఏ రంగు డబ్బాలో వేయాలో విద్యార్థులకు ప్రాక్టికల్‌గా చూపించి అవగాహన కల్పించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు.