MachilipatnamLocal News
September 5, 2026
కృష్ణా జిల్లా

అయోధ్య రామ మందిరం మొదటి వార్షికోత్సవం

  • February 25, 2026
  • 0 min read
అయోధ్య రామ మందిరం మొదటి వార్షికోత్సవం
మచిలీపట్నం :
 
 మచిలీపట్నం ఈడేపల్లిలో కొలువై ఉన్న అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్స కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని మంగళ తోరణాలతో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సత్య సాయి సేవాసమితి సేవాదళ సభ్యులు ఈ సందర్భంగా నారాయణ సేవను జరిపించారు. సాయి భక్తులు లలితా సహస్ర నామము విష్ణు సహస్రనామము కాలభైరవ అష్ట కాన్ని పటించారు. ఈ కార్యక్రమంలో గౌర వెంకటేశ్వరరావు, కుమ్మరి జలా చంద్రుడు, గోపాల వెంకటేశ్వరరావు, కుమ్మరి హర్ష, గోపాల సాయిబాబు, బొంకూరి సురేష్, కుమ్మరి రామాంజనేయులు, దేవనూరు మణిబాబు, గౌర హరిబాబు, సాయి సేవాసమితి కన్వీనర్ పోతు కూచి ఆంజనేయకుమార్, వరప్రసాద్, మోహన్, వెంకటలక్ష్మి, రంగనాయకమ్మ, సుంకర గంగా మహాలక్ష్మి మొదలు సాయి భక్తులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *