కార్పొరేషన్ చైర్మన్ లను డైరెక్టర్లను నియమించడంలో సిఫారసు చేయాలి
మచిలీపట్నం :
ఉద్యోగ, ఉపాధి ఆర్థిక రంగాల్లో వెనుకబడిన శిష్టకరణాలను ఆదుకోవాలని టిడిపి శిష్టకరణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, ఏపీ శిష్టకరణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కుమహంతి రాజా కేంద్ర విమానాయనశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల రెండు రోజుల పర్యటనకు ఆదివారం విచ్చేసిన ఆయన కిడ్నీ తదితర సమస్యలల్లో ఉన్న కొన్ని శిష్టకరణ కుటుంబాలను పలకరించారు. అనంతరం శ్రీకాకుళం లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ను కలిసి శిష్టకరణాల దయనీయ స్థితిగతులను వివరించారు. ముఖ్యంగా కేంద్ర బీసీ జాబితాలో శిష్ట కరణ సామాజిక వర్గాన్ని చేర్పించడం లో ప్రయత్నాన్ని ముమ్మరం చెయ్యాలని, సామాజిక భవన నిర్మాణాలకు, స్థలాలు- నిధులు కేటాయించడంలో, ఆర్థిక చేయుత నిమిత్తం సంక్షేమ పథకాలు సంపూర్ణంగా చేరడం కోసం శిష్టకరణ కార్పొరేషన్ కు చైర్మన్, డైరెక్టర్ లను నియమించడం లో కృషి చెయ్యాలని కోరారు. సోమవారం దివంగత ప్రజానేత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన అరసవల్లి లో గల మాజీ టీడీపీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిఇంటికి చేరుకుని ఆమె భర్త మృతి కారణంగా ఆమెకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ తో కూడా ముచ్చటిస్తూ టిడిపి ప్రభుత్వ ప్రగతిని, ఒకనాటి నాయకుల కృషిని గుర్తుచేసుకున్నారు. శిష్టకరణ సాధికార సమితి రాష్ట్ర నాయకులు మానాపురం గౌరీశ్వర రావు సదాశివుని వెంకటేశ్వర రావు, మునగవలస రవీంద్రబాబు, కుప్పిలి వెంకట రమణమూర్తి, కరకవలస ప్రహ్లాదరావు, ఎస్విడి మురళి, ఆర్వీన్ శర్మ, పెదపెంకి శ్రీరామ్ కుమార్, బలివాడ గోవిందరావు, డబ్బీరు వెంకట రావు , బెహరా నాగేశ్వర రావు తదితరులు వీరితోపాటు ఉన్నారు.