MachilipatnamLocal News
April 14, 2026
కృష్ణా జిల్లా

కౌన్సిల్ ఆమోదం పొందని పట్టాభి సీతారామయ్య మెమోరియల్ స్థలం

  • February 24, 2026
  • 0 min read
[addtoany]
కౌన్సిల్ ఆమోదం పొందని పట్టాభి సీతారామయ్య మెమోరియల్ స్థలం
మచిలీపట్నం :
 
మచిలీపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన హాట్ హాట్‌గా జరిగింది. నగర అభివృద్ధి, ప్రాధాన్య సమస్యలు, పెండింగ్ పనులు వంటి అంశాలపై చర్చలు సాగినప్పటికీ సభ వాతావరణం రాజకీయ వేడితో కాసేపు ఉద్రిక్తంగా మారింది. అధికారుల తీరుపై వైసిపి పార్టీ కార్పొరేటర్లు స్పందించారు.
అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా ఎజెండా అంశంలో ఉన్న స్వతంత్ర సమరయోధులు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య మెమోరియల్‌కు స్థలం కేటాయింపు అంశంపై తీవ్ర స్థాయిలో చర్చించే సమయంలో ఆరోపణలు, గుప్పించుకుంటూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టాభి సీతారామయ్య స్థలం అంశం మళ్లీ కౌన్సిల్ ఆమోదం లేకుండానే సమావేశం ముగిసింది.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *