మచిలీపట్నం :
ప్రపంచ శాంతి కోసమే భారతదేశం వ్యాప్తంగా దివ్యజ్ఞాన సమాజం కృషి చేస్తుందని ప్రముఖ ఆడిటర్ సీనియర్ సభ్యులు సి. శేషాచార్యులు (అప్పాజీ )అన్నారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర దివ్యజ్ఞాన సమాజ సదస్సుకు మచిలీపట్నం నుండి హాజరైన ఆరు సభ్యులను సన్మానించడానికి మచిలీపట్నం దివ్యజ్ఞాన సమాజం మంగళవారం సాయంత్రం ఈడేపల్లి లో ని ఆల్కట్ లాడ్జ్ బిల్డింగ్ లో మచిలీపట్నం శాఖ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆడిటర్ అప్పాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కాలాతీత జ్ఞానానికి అంకితం కావాలని, నిత్యం సత్యము అనేది అంతులేని శక్తిని ఇస్తుందని అన్నారు. జిడ్డు కృష్ణమూర్తి రచనల ద్వారా ప్రతి ఒక్కరూ స్వయంకృషితో ఎదగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం పొందాలని అప్పాజీ అన్నారు. కులాలకు మతాలకు ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని అప్పాజీ అన్నారు.
దివ్యజ్ఞాన సమాజం జాతీయ స్పీకర్ విశ్రాంత అధ్యాపకులు సవరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వివిధ మతాల సర్వోన్నత సత్యాన్ని అందరూ గ్రహించాలని, అన్ని మతాల మానవ మహోన్నత విలువలను నేటి యువతరం అందించాలని అన్నారు. అందుకోసం దివిజ్ఞాన సమాజం 150 సంవత్సరాలుగా కృషి చేస్తుందని తెలియజేశారు.
మచిలీపట్నం దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షులు న్యాయవాది
లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సదస్సులో రాజమండ్రిలో గత వారం మచిలీపట్నం నుండి ఆరుగురు సీనియర్ సభ్యులు హాజరు కావడం అభినందనీయమని అన్నారు. సమాజ మార్పు కోసం యువతలో నైతిక విలువలు పెంచడం కోసం దివ్యజ్ఞాన సమాజం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
మరో సీనియర్ సభ్యులు కారుమూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సర్వకాలీనమైన సత్యాన్ని తెలుసుకోవడమే దివ్యజ్ఞానం అని అన్నారు. ప్రతి ఒక్కరూ వారిలోని అంతర్గత శక్తులను తెలుసుకోవాలని అన్నారు.
ద్విజ్ఞాన సమాజం కార్యదర్శి కొత్తకొండు రమేష్ రాష్ట్ర సదస్సు కార్యక్రమాలను వివరించారు. అనంతరం గౌరవ అధ్యక్షులు అప్పాజీని రాష్ట్ర సదసు కి హాజరైన ఆరుగురు సభ్యులను మచిలీపట్నం దివ్య జ్ఞాన సమాజం సన్మానించింది. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎం. సత్యనారాయణ సీనియర్ న్యాయవాది గుడిసేవ మురళి ఇతర సభ్యులు పాల్గొన్నారు.