ఘంటసాల మండల పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఘంటసాల ఎస్ ఐ. చందన వారి సిబ్బంది తో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రదేశంలో పలువురిని అదుపులోకి తీసుకొని, ఒక కోడి పుంజును స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో రూ.1,670 నగదు కూడా పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.
పందేలు నిర్వహణకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అక్రమ కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఘంటసాల ఎస్ ఐ. చందన హెచ్చరించారు. స్థానికులు చట్టవిరుద్ధ కార్యక్రమాలపై సమాచారం అందించాలని కోరారు.