మచిలీపట్నం:
భారత సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు సుకన్య శాంత భారత్ యూనియన్, ఇతరుల కేసుల ననుసరించి భారత దేశములో ఉన్న జైళ్ల స్థితిగతులు, ముద్దాయిలకు ఇస్తున్న సదుపాయములు, వసతులు కుల, మత సంబంధిత విచక్షణ గురించి తనిఖీలలో భాగముగా శుక్రవారం స్పెషల్ సబ్ జైల్, మచిలీపట్నం నకు బోర్డు ఆఫ్ విజిటర్స్ తో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ న్యాయ మూర్తి, సీనియర్ సివిల్ జడ్జ్ కె.వి రామ కృష్ణయ్య , పోతు రాజు , రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మచిలీపట్నం, డాక్టర్ పి యుగంధర్ డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, ఎ. రమణ రావు, సూపరింటెండిగ్ ఇంజనీర్ పంచాయత్ రాజ్ మచిలీపట్నం, బిఎస్సి శేఖర్ సింగ్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మచిలీపట్నం , ఎస్.కె షాహీద్ బాబు, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మచిలీపట్నం, బ్రహ్మం డిస్ట్రిక్ట్ ఎంప్లాయి మెంట్ ఆఫీసర్ మచిలీపట్నం, ఎన్ పద్మావతి, డిస్ట్రిక్ట్ అగి)కల్చర్ ఆఫీసర్ మచిలీపట్నం, ఆర్ వెంకటేశ్వర రావు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్ మచిలీపట్నం తదితరులు అధికారులు సందర్శించారు.
అందరు ముద్దాయిలతో సంభాషించి జైలులో అందుతున్న సదుపాయముల గురించి, శుభ్రత, ఆహారం, న్యాయ సహాయము, ముద్దాయిలతో జైలు నందు చేయుంచుచున్న పనులలో ఏమైన కుల వివక్షత చూపు తున్నారని ముద్దయిలను అడిగి తెలిసి కొన్నారు. సబ్ జైలు ఖైదీ లందరు మంచి పరివర్తనతో మెలగాలని అధికారులు సూచించారు. ఈ కార్య క్రమములో లీగల్ ఎయిడ్ డిఫెన్సు కౌన్సిల్ అడ్వకేట్ చీలి ముసలయ్య, జైల్ సూపరింటెండెంట్ పిల్లా రమేష్, డిప్యూటి జైలర్ టి మాలి బాబు, జైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.