మచిలీపట్నం:
కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి
కె. ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో 45వ డివిజన్ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు మంగళవారం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి అని, మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అన్నారు.
చెస్ ఒక మేదస్సు ఆధారిత ఆట అన్నారు. ఇది మన ఆలోచన శక్తిని, సహనాన్ని మరియు నిర్ణయ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది అన్నారు. చెస్ ద్వారా మనం ముందు చూపుతో ఆలోచించడం నేర్చుకుంటాం అన్నారు. చెస్ పోటీలలో ప్రముఖ గ్రాండ్ మాస్టర్ విశ్వనాధ్ ఆనంద్ ప్రపంచ ఖ్యాతి పొందారు అన్నారు. అలాంటివారిని స్ఫూర్తిగా తీసుకుని ఆటలో ముందుకు వెళ్లి పోటీలో విజయం సాధించాలి అన్నారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో అవసరం, అందరూ రోజు కొంత సమయం క్రీడలకు కేటాయించాలి అన్నారు.
జిల్లా క్రీడా అధికారి కె. ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి చెస్ పోటీల ఎంపికలో భాగంగా జిల్లా స్థాయిలో చెస్ పోటీలలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 155 మంది యువత చెస్ పోటీలలో పాల్గొన్నారు అని తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన చెస్ పోటీలలో 16 మంది యువత రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు విజేతలుగా ఎంపికయ్యారని, ఈ రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో ఎంపికైన వారు ఈనెల 21, 22 తేదీలలో తిరుపతిలో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు వారిని పంపించడం జరుగుతుంది అన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది అని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతను జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి, కె. ఝాన్సీ లక్ష్మి కోరారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్, హసీం బేగ్, రాష్ట్ర శిష్ట కరణం సాధికార సమితి కన్వీనర్, అక్కుమహంతి రాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర కార్పొరేషన్ అధ్యక్షుడు, లోగి శెట్టి వెంకటస్వామి, జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్, అజీమ్, ప్రముఖ న్యాయవాది అమర్, చెస్ ఆర్గనైజేషన్ ఆర్బిట్రేటర్స్ తదితరులు పాల్గొన్నారు.