MachilipatnamLocal News
April 15, 2026
కృష్ణా యూనివర్సిటీ

ఫార్మా రంగంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలం- కెయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష

  • February 13, 2026
  • 0 min read
[addtoany]
ఫార్మా రంగంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలం- కెయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష
– ఉత్సహంగా ఫార్మసీ ఫ్రెషర్స్ డే వేడుకలు
 
మచిలీపట్నం: 
 
          దేశ ఫార్మా రంగంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలం గా ఉన్నాయని, ఫార్మసీ విద్యార్ధులు విజయవంతంగా కోర్స్ పూర్తిచేసుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష పేర్కొన్నారు.
          శుక్రవారం కృష్ణా విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల లలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రజల యోగక్షేమాలు దృష్ట్యా ఫార్మా విద్యార్ధుల బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి వుంటుందన్నారు. ఇంజింజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి మాట్లాడుతూ ఫార్మాసిస్ట్ లేని సమాజం ను ఊహించుకోవడం కూడా కష్టమేనన్నారు. ఫార్మసీ విద్యార్ధులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు కృషిచేస్తున్నారన్నారు. 
           ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు అధ్యక్షోపన్యాసం చేస్తూ వైద్యుడు కంటే ఫార్మాసిస్ట్ బాధ్యత ఎక్కువ గా ఉంటుందని చెప్పారు. వైద్యుడు నిర్లక్ష్యం గా ఉంటే ఒక ప్రాణం మాత్రమే పోతుందని, ఫార్మాసిస్ట్ బాధ్యతారాహిత్యం గా ఉంటే వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *