క్రాంతిజ్యోతి సావిత్రి భాయి పూలే 195 వ జయంతి వేడుకలు ను కృష్ణా విశ్వవిద్యాలయం లో ఘనంగా నిర్వహించారు. శనివారం ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యములో నిర్వహించిన కార్యక్రమంలో సావిత్రి భాయి పూలే చిత్రపటానికి ఉపకులపతి ఆచార్య కె రాంజీ, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ మహిళలకు విద్య అవశ్యకత ను గుర్తించిన పూలే దంపతులు దేశంలో మొదటి మహిళా పాఠశాల, వసతి గృహం ను ఏర్పాటు చేసిన మహోన్నతులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం.శ్రావణి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.