MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం

  • December 31, 2025
  • 0 min read
[addtoany]
భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం
 మచిలీపట్నం :
 
 వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం మచిలీపట్నంలోని వివిధ దేవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
 బచ్చుపేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనాన్ని కలగజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ముక్తేవి శశికాంత్ స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ, పదవ కోర్టు ఏ డీజే బాబు నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి దేవుని దర్శనం చేసుకొని పూజల్లో పాల్గొన్నారు. మచిలీపట్నం మెయిన్ రోడ్ ఏం చేస్తున్న భద్రాద్రి రామాలయ దేవస్థానం నందు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరణలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యనిర్వాన అధికారి వై శిరీష,కే శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్, కార్పొరేషన్ మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అర్చకులు గరిమెళ్ళ రామానుజ శ్రీకారచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  మచిలీపట్నం మెయిన్ రోడ్ లోని శ్రీ రంగనాయక స్వామి దేవస్థానం నందు ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన కోలాట ప్రదర్శనలో భక్తులు కోలాటాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి గొర్రెపాటి. గోపీచంద్, మోటమర్రి. వెంకట బాబా ప్రసాద్, లోగిశెట్టి.వెంకటస్వామి మరియు వందలాదిమంది భక్తులు విచ్చేసి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని కార్య నిర్వహణ అధికారి మాగపాటి సత్యప్రసాద్ బాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *