రైలుపేట యూపీహెచ్సీ పరిధిలో వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ
మచిలీపట్నం :
దోమల కాటు ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా శనివారం మచిలీపట్నం రైలుపేట యూ.పి.హెచ్.సి పరిధిలోని పలు వసతి గృహాల విద్యార్థులకు దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎల్. దయాకర్, జిల్లా మలేరియా అధికారి ఎ. జ్ఞానశ్రీ ఆదేశాల మేరకు స్థానిక ఎస్.సి. గర్ల్స్ హాస్టల్ 1 & 4 తో పాటు, ఎస్.సి. కాలేజీ బాయ్స్ హాస్టల్-1 లోని విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది దోమతెరలను అందజేశారు. ఈ సందర్భంగా దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్లు బి. రాఘవేంద్ర రావు, బి. సూరిబాబు, హెల్త్ అసిస్టెంట్ ఎం. చంద్ర మోహన్ పాల్గొన్నారు. వీరితో పాటు ఆయా హాస్టళ్ల విభాగాల వారీగా ఏఎన్ఎంలు ఐ. రత్నసేన, ఎల్. భవాని, ఆశా వర్కర్లు బి. వెంకటరమణ, ఎస్. ప్రశాంతి, హాస్టల్ వార్డెన్లు వై. మల్లేశ్వరి, సంతోష్ మరియు ఇతర వైద్య సిబ్బంది హాజరయ్యారు.

