MachilipatnamLocal News
November 22, 2026
విద్య - ఉపాధి

పెడన APSSDC స్కిల్ హబ్‌లో ఉచిత డేటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ: పోర్ట్ ఉద్యోగ అవకాశాలకు సువర్ణావకాశం

  • November 2, 2026
  • 1 min read
పెడన APSSDC స్కిల్ హబ్‌లో ఉచిత డేటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ: పోర్ట్ ఉద్యోగ అవకాశాలకు సువర్ణావకాశం

మచిలీపట్నం:

మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం పూర్తి కానున్న నేపథ్యంలో, అందులో వచ్చే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నిరుద్యోగ యువతీ యువకులను ముందే సిద్ధం చేయడమే లక్ష్యంగా APSSDC (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ), NSDC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెడన స్కిల్ హబ్ కోఆర్డినేటర్ బాబు వంగ తెలిపారు.

ఆఫీస్ కార్యకలాపాల నిర్వహణ, ‘డిజిటల్ మిత్ర / డేటా ఎంట్రీ ఆపరేటర్’ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కోర్సు ముఖ్యాంశాలు
* అర్హత: 10వ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన 18 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ యువకులు అర్హులు.
* శిక్షణ వివరాలు: శిక్షణా కాలం 3 నెలలు. నవంబర్ 16 నుండి తరగతులు ప్రారంభమవుతాయి (ప్రతిరోజూ మధ్యాహ్నం 1:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు).
* నేర్పించే అంశాలు: అడ్వాన్స్‌డ్ MS ఆఫీస్, AI & ChatGPT, డేటా ఎంట్రీ & AI డేటా అనోటేషన్, డిజిటల్ పేమెంట్స్, సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్.
* ప్రత్యేకతలు: అధునాతన ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌తో శిక్షణ ఇవ్వబడుతుంది. పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలకు తగిన మార్గదర్శకత్వం ఇస్తారు.

కావలసిన పత్రాలు & సంప్రదించాల్సిన వివరాలు

ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీట్లు పరిమితంగా ఉన్నందున వెంటనే సంప్రదించాలని కోరారు.
* శిక్షణా స్థలం: APSSDC స్కిల్ హబ్, శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల, గూడూరు రోడ్, పెడన.
* సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: బాబు వంగ (స్కిల్ హబ్ కోఆర్డినేటర్, పెడన) – 8897772488

About Author

SSN