MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

మచిలీపట్నంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు

  • November 1, 2026
  • 0 min read
మచిలీపట్నంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు

మచిలీపట్నం:

మచిలీపట్నం నగరం 17వ డివిజన్ పరిధిలోని ఐదు రోడ్ల కూడలి వద్ద ఆదివారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఐదు రోడ్ల సెంటర్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పలువురు ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన త్యాగశీలి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని ధారపోసిన ధైర్యశాలి అని, ఆయన త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రొఫెషనల్ అండ్ ఆఫీషియల్ సంఘం సభ్యులు గోళ్ళ ప్రసాద్, పులవర్తి శ్రీనివాస్, ఏ.బీ.వీ.ఆర్. ప్రసాద్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణమూర్తి, మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ మామిడి మురళీకృష్ణ, మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వన్నెంరెడ్డి శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు మరకాని రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN