MachilipatnamLocal News
October 22, 2026
జిల్లా

జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పై లోకాయుక్తకు నివేదిక సమర్పణ

  • October 21, 2026
  • 1 min read
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పై లోకాయుక్తకు నివేదిక సమర్పణ

ఉయ్యూరు:

కృష్ణా జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ప్రమోషన్లు, బదిలీల విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్ బాబు పై గౌరవ లోకాయుక్తకు నివేదిక సమర్పించారు. గౌరవ లోకాయుక్త తల్లాప్రగడ మల్లిఖార్జునరావు ఆదేశాల మేరకు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి తన నివేదికను రాష్ట్ర లోకాయుక్తకు సమర్పించారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణికి ది. 27.02.2026న నివేదిక సమర్పించగా (Collector, Lr.Rc.NO. 3162084/11/5/2026, Dt. 27.02.2026), ఆ నివేదికను లోకాయుక్తకు అందించారు.

ఈ వ్యవహారానికి సంబంధించి గౌరవ లోకాయుక్త కేసు నెం. 1865/2026/బి1 నమోదు కాగా, గౌరవ రాష్ట్ర లోకాయుక్త ఈ కేసును డిసెంబర్ 1వ తేదీన విచారించనున్నారు.  ఈ వివరాలను ‘యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ. క్యాంపైన్’ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు జంపాన శ్రీనివాసగౌడ్ మరియు శిరివెళ్ల గౌరి తెలిపారు.

About Author

SSN