MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీ బాలశౌరి సమీక్ష

  • October 16, 2026
  • 0 min read
స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంపీ బాలశౌరి సమీక్ష

మచిలీపట్నం :

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని సమన్వయం, ప్రచార కార్యాచరణపై పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) వల్లభనేని బాలశౌరి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.

మచిలీపట్నంలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎంపీ బాలశౌరి నియోజకవర్గ స్థాయి సమన్వయకర్తలతో విస్తృతంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సరళి, వార్డులు/మండలాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమన్వయకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేసి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సమన్వయకర్తలు మండలి వెంకటరామ్, బండి రామకృష్ణ, చిలకలపూడి పాపారావు, డాక్టర్ మాధవి తదితరులు పాల్గొని ఎన్నికల ప్రచార ప్రణాళికలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

About Author

SSN