MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

మచిలీపట్నంలో ఘనంగా ‘ఫ్రైడే-డ్రైడే’.. మురుగు గుంటల్లో ఆయిల్ బాల్స్ వేసిన వైద్యాధికారి

  • October 16, 2026
  • 1 min read
మచిలీపట్నంలో ఘనంగా ‘ఫ్రైడే-డ్రైడే’.. మురుగు గుంటల్లో ఆయిల్ బాల్స్ వేసిన వైద్యాధికారి

మచిలీపట్నం:

కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణ మరియు దోమల నియంత్రణే ధ్యేయంగా మచిలీపట్నం చిలకలపూడి 2వ UPHC పరిధిలోని 7వ సచివాలయం వద్ద ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

యుపిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు మురుగు గుంటలలో ఆయిల్ బాల్స్ వేశారు. అనంతరం స్థానిక ఇళ్లలో ఫీవర్ సర్వే చేపట్టి, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల, నీరు నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ శ్రావ్యతో పాటు హెల్త్ సూపర్‌వైజర్లు బి. రాఘవేంద్రరావు, భట్రాజు సూరిబాబు, హెల్త్ అసిస్టెంట్ కోటేశ్వరరావు, ఏఎన్‌ఎం రాణి, అంగన్‌వాడీ టీచర్ జి. పద్మావతి, ఆశా వర్కర్ ఎ. పద్మ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN