MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు జిల్లా స్థాయి ఎంపికలు: అక్టోబర్ 22 నుంచి 24 వరకు కృష్ణా జిల్లాలో నిర్వహణ

  • October 15, 2026
  • 1 min read

మచిలీపట్నం:

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి గానూ నిర్వహించనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు, ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి తెలిపారు.

ఈ ఎంపిక పోటీలు 2026 అక్టోబర్ 22 నుండి 24వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో జరగనున్నాయి. ఆథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, చెస్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, యోగా మొదలైన మొత్తం 19 క్రీడా విభాగాల్లో ఈ ఎంపికలు ఉంటాయి. కొన్ని క్రీడల్లో పురుషులు, మహిళలు, వెటరన్ విభాగాలకు అవకాశం కల్పించారు.

అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు తమ సంబంధిత శాఖల ద్వారా వివరాలు తెలుసుకొని ఈ జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు 2026 అక్టోబర్ 28 నుండి 30వ తేదీ వరకు గుంటూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో రాష్ట్ర స్థాయి ఎంపికలు నిర్వహించబడతాయని తెలిపారు.

రోజువారీ ఆటల/పోటీల వివరాలు:

22-10-2026 (మొదటి రోజు):

 * ఆథ్లెటిక్స్ : పరుగులు, జంప్స్, త్రో ఈవెంట్లు

 * బ్యాడ్మింటన్ : సింగిల్స్ / డబుల్స్

 * పవర్ లిఫ్టింగ్ : బరువు విభాగాల ఆధారంగా

 * వెయిట్‌లిఫ్టింగ్ : వివిధ బరువు రకాలు/విభాగాలు

 * చెస్: వ్యక్తిగత చెస్ పోటీలు

 * యోగా : పురుషులు, మహిళల విభాగాలు

 * టేబుల్ టెన్నిస్: వ్యక్తిగత / టీమ్ ఈవెంట్లు

 * కేరమ్స్ : పురుషులు, మహిళల విభాగాలు

23-10-2026 (రెండవ రోజు):

 * వాలీబాల్ : పురుషులు, మహిళలు

 * బాస్కెట్‌బాల్ : పురుషులు, మహిళలు

 * ఫుట్‌బాల్ : పురుషుల విభాగం

 * లాన్ టెన్నిస్ : పురుషులు, మహిళలు

 * హాకీ : పురుషులు, మహిళలు

 * క్రికెట్ : పురుషుల విభాగం

24-10-2026 (మూడవ రోజు):

 * స్విమ్మింగ్ : వివిధ ఈవెంట్లు

 * కబడ్డీ : పురుషులు, మహిళలు

 * ఖో-ఖో: పురుషులు, మహిళలు

 * రెజ్లింగ్ : వివిధ బరువు విభాగాలు

 * బెస్ట్ ఫిజిక్: వివిధ బరువు విభాగాలు

About Author

SSN