MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

మచిలీపట్నం ఆర్.డి.ఓ కార్యాలయ ప్రజా సమాచార అధికారిపై క్రమశిక్షణా చర్యలకు ఫిర్యాదు

  • October 13, 2026
  • 1 min read
మచిలీపట్నం ఆర్.డి.ఓ కార్యాలయ ప్రజా సమాచార అధికారిపై క్రమశిక్షణా చర్యలకు ఫిర్యాదు

మచిలీపట్నం:

మచిలీపట్నం ఆర్.డి.ఓ కార్యాలయం ప్రజా సమాచార అధికారి మరియు పరిపాలనా అధికారి వై. రంగారావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి. సాయి ప్రసాద్ కు ఆర్.టి.ఐ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

ఘటన వివరాలు:

రాష్ట్రంలో వ్యవసాయ భూమి కలిగిన రైతుల పేర్లు వెబ్‌ల్యాండ్‌లో నమోదుకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల కాఫీలను ధృవీకరించి సమాచారం ఇప్పించవలసిందిగా 31.08.2026 న ఆర్.టి.ఐ చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది. అయితే ఆ దరఖాస్తుకు సమాధానంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, సరైన సమాచారాన్ని ఇవ్వలేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ, సమాచారం ఇవ్వకుండా, ఉద్యోగ నిర్వహణను చిత్తశుద్ధితో నిర్వహించని మచిలీపట్నం ఆర్.డి.ఓ కార్యాలయం ప్రజా సమాచార అధికారి  వై. రంగారావుపై జి.ఓ.ఎం.ఎస్.నెం.114, జనరల్ అడ్మిన్ (సెర్చ్) డిపార్ట్‌మెంట్, తేది: 16.03.2009 ప్రకారం సి.సి.ఏ రూల్స్ కింద తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ కార్యకర్తలు జంపాన శ్రీనివాస గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు, గుంజా హేమలతలు రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

About Author

SSN