దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఈడేపల్లి కాళికా అమ్మవారి శక్తి పటం!
మచిలీపట్నం:
నగర నడిబొడ్డున ఉన్న ఈడేపల్లి కాళికా శక్తి అమ్మవారి గుడిలో దేవి శరన్నవరాత్రోత్సవాల పూజల కోసం శక్తి పటాన్ని సుదగాని బ్రహ్మేశ్వరరావు ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల్లో ఈ పటాన్ని నగరంలో అత్యంత వైభవంగా ఊరేగిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఈ ఉత్సవ కార్యక్రమాలన్నీ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆళ్ల శివరత్నం, కార్యదర్శి విన్నకోట గంగా ప్రసాద్ మరియు కోశాధికారి పామర్తి వెంకట మోరిల పర్యవేక్షణలో జరగనున్నాయి.

