శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్: ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సిద్ధం!
మచిలీపట్నం:
శబరిమల శ్రీ ధర్మశాస్తా ఆలయ దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కృష్ణా జిల్లా ప్రజా రవాణా శాఖ ప్రత్యేక అద్దె ప్రాతిపదికన బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
పాత ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు
గత సంవత్సరంలో ఉన్న ప్రత్యేక అద్దె ఛార్జీలనే ఈ సంవత్సరం కూడా ఎటువంటి పెంపు లేకుండా కొనసాగిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
* సూపర్ లగ్జరీ బస్సు: కిలోమీటర్‌కు రూ. 57/-
* స్టార్ లైనర్ బస్సు: కిలోమీటర్‌కు రూ. 66/-
* ఎక్స్‌ప్రెస్ బస్సు: కిలోమీటర్‌కు రూ. 62/-
భక్తులకు ప్రత్యేక రాయితీలు & సౌకర్యాలు
* బృందాలుగా బస్సులను బుక్ చేసుకునే వారికి సీటింగ్ కెపాసిటీని బట్టి ఏడుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తారు.
* గురుస్వాములకు ప్రత్యేక రాయితీలు ఇవ్వబడతాయి.
* అన్ని ప్రత్యేక బస్సులలో ఆడియో, వీడియో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
* ప్రయాణికుల బృందం కోరిన చోటికే (వారి ఊరి వద్దకే) బస్సులను పంపడం జరుగుతుంది.
ఇతర పుణ్యక్షేత్రాలు, శుభకార్యాలకూ బస్సులు
కేవలం శబరిమల మాత్రమే కాకుండా విహారయాత్రలు, వివాహాది శుభకార్యాలు, మరియు అరుణాచలం, నాగపట్నం, నెల్లూరు దర్గా, అయోధ్యా, వారణాసి వంటి ఇతర దూరప్రాంత పుణ్యక్షేత్రాల దర్శనానికి కూడా ఎ.సి, స్టార్ లైనర్ (నాన్ ఎ.సి స్లీపర్), సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు పొందవచ్చని తెలిపారు.
సంప్రదించాల్సిన డిపో మేనేజర్ల ఫోన్ నంబర్లు:
* మచిలీపట్నం: 9959225462
* అవనిగడ్డ: 9959225466
* గుడివాడ: 9959225464
* గన్నవరం: 8790996090
* ఉయ్యూరు: 9959224796
ఆసక్తి గల భక్తులు, ప్రయాణికులు సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదించి బస్సులను బుక్ చేసుకోవచ్చని కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి తెలిపారు.

