MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

139 బీసీ కులాలకు చట్టబద్ధ రక్షణ కల్పించాలి: కూటమి ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

  • October 2, 2026
  • 0 min read
139 బీసీ కులాలకు చట్టబద్ధ రక్షణ కల్పించాలి: కూటమి ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్

మచిలీపట్నం:

రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో శాశ్వత చట్టబద్ధ రక్షణ కల్పించాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మచిలీపట్నంలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… జీవోలు, తాత్కాలిక నిర్ణయాలతో బీసీలకు శాశ్వత పరిష్కారం లభించదని, శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని కోరారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచి, సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తెచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు జన్ను గోవిందు, భోగిరెడ్డి సుభాని, నరిశెట్టి రత్తయ్య, పి. సాంబయ్య, నీలపాల కృష్ణ, బి. నాగరాజు, జి. దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN