MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

పిన్న వయసులో పద్మావతి మృతి బాధాకరం

  • September 30, 2026
  • 1 min read
పిన్న వయసులో పద్మావతి మృతి బాధాకరం

కుటుంబానికి తీరని లోటు.. ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు

ఘనంగా కుమ్మరిగుంట (నందం) పద్మావతికి నివాళులు

మచిలీపట్నం:

పిన్న వయసులోనే కుమ్మరిగుంట (నందం) పద్మావతి మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఆమె మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు అన్నారు. స్థానిక బైపాస్‌ రోడ్డులోని మిరియాల కన్వెన్షన్‌ హాల్లో బుధవారం నిర్వహించిన పద్మావతి పెద్దకర్మ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పద్మావతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ సీనియర్‌ జర్నలిస్టు, కథా-నవలా రచయిత నందం రామారావు ద్వితీయ కుమార్తె పద్మావతి ఈ నెల 16వ తేదీ రాత్రి గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉన్న పద్మావతి అకాల మరణం ఎంతో విషాదకరమని పేర్కొన్నారు. కేవలం 48 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూయడం కుటుంబానికి భరించలేని విషాదమని, ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని సంతాపం వ్యక్తం చేశారు.

పద్మావతి భర్త కుమ్మరిగుంట మధు విజయవాడలోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ షోరూమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, పద్మావతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కుంచెనాని, తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తిన దాసు, కరెడ్ల సుశీల, అక్కు మహతి రాజా, ఆంధ్రప్రభ బ్యూరో రాంప్రసాద్, జిల్లా మేనేజర్‌ సురేష్ , వార్తాప్రభ ఎడిటర్‌ వీర్ల శ్రీరామయాదవ్‌, పల్లె క్రాంతి ఎడిటర్‌ నాగరాజు, తెలుగు ట్రాక్‌ ఎడిటర్‌ కిరణ్‌, పలువురు పాత్రికేయులు, బంధుమిత్రులు, దూరదర్శన్‌ విజయవాడ అధికారులు తదితరులు పాల్గొని పద్మావతికి ఘన నివాళులర్పించారు. అనంతరం నందం రామారావు, ఆయన కుమారుడు శ్రీనివాస్‌, అల్లుడు మధులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

About Author

SSN