టెన్నిస్ పోటీల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయికి ఎంపిక
మచిలీపట్నం:
స్థానిక శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి కూనపరెడ్డి నాగ హరీష్ శశాంక్ కృష్ణా జిల్లా స్థాయి అండర్-19 టెన్నిస్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో అతడు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.
ఈ సందర్భంగా శశాంక్ కృషి, పట్టుదలను అభినందిస్తూ పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శశాంక్ సాధించిన విజయం పాఠశాలకు ఎంతో గర్వకారణమని, రాబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరింత ఉన్నత విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

