గాంధీనగర్లో ఘనంగా వినాయక లడ్డూ వేలం: ₹22,300లకు దక్కించుకున్న భక్తులు
మచిలీపట్నం:
స్థానిక గాంధీనగర్, నరసింహనగర్లో శ్రీ విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరిలో బుధవారం స్వామివారి ప్రసాదం లడ్డూ వేలం పాటను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ పోటీలో శ్రీమతి వనజ మరియు ఆమె కుమారుడు లోకేష్ కలిసి ₹22,300 రూపాయలకు లడ్డూను పాడి స్వామివారి దివ్య ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ ప్రెసిడెంట్ చండీక ఫణి, సభ్యులు మెండు శశాంక్, నగిడి రత్నకుమార్, కేశన ధనుష్, జొన్నల సాయి కరుణ కుమార్ తదితరులు పాల్గొని విజేతలకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

