MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

మచిలీపట్నంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు: అలరించిన రాధాకృష్ణుల వేషధారణలు

  • September 4, 2026
  • 0 min read
మచిలీపట్నంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు: అలరించిన రాధాకృష్ణుల వేషధారణలు

మచిలీపట్నం:

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని బృందావన్ థియేటర్ ఆవరణలో యాదవ సేవాసంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా సాగాయి. బందరు నియోజకవర్గ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పల్లపాటి వెంకట్రావు (చినబాబు) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తొలుత సంప్రదాయబద్ధంగా గోపూజ నిర్వహించి, శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు ఆచరించారు.

ఈ సందర్భంగా చిన్నారులు వేసిన బాలకృష్ణుడు, రాధమ్మల వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో బొర్రా శ్రీనివాస్, గొరిపర్తి విశ్వనాధ బాబు, బసవేశ్వర బాబు, పల్లపాటి చినబాబు, గొరిపర్తి రాము, ఆరేపు లక్ష్మణ కుమార్, దేవనబోయిన వెంకట కృష్ణారావు, ఎంపరాల సత్యనారాయణ, తోట నాంచారయ్య, సండ్రం సూర్య ప్రకాష్, నేలపాల రామకృష్ణ మరియు యాదవ సంఘం ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

About Author

SSN