MachilipatnamLocal News
April 30, 2026
జిల్లా

జిల్లా అధికారులతో భూ పరిపాలన కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

  • April 23, 2026
  • 1 min read
[addtoany]
జిల్లా అధికారులతో భూ పరిపాలన కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్
మచిలీపట్నం :
 
గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి విజయలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తదితర ఉన్నతాధికారులు రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా 22ఏ నిషేధిత భూములు, రీ-సర్వే పురోగతి, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, ఘన వ్యర్థాల యూనిట్ల ఏర్పాటు కోసం భూ సేకరణ, జల ధార జల హారతి ప్రాజెక్ట్ తదితర అంశాలపై సమీక్షించారు. ఆయా అంశాలపై వారు జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.
 
వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ కె. చంద్రశేఖరరావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, డ్వామా పీడీ శివప్రసాద్, డ్రైనేజీ ఈఈ కిరణ్ బాబు, భూగర్భ జల శాఖ ఏడీ బిందుశ్రీ, మచిలీపట్నం నగర సహాయ కమిషనర్ గోపాలరావు, భూ రికార్డులు సర్వే, దేవాదాయ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *