వట్టెం అక్షిత ఎస్ ఎస్ సి పరీక్ష ఫలితాలలో జిల్లా ఫస్ట్
మచిలీపట్నం :
గురువారం విడుదలైన ఎస్ ఎస్ సి పరీక్షల ఫలితాల సందర్భంగా, కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల కేటగిరీలో మొదటి స్థానాన్ని గుడివాడలోని ఏ కె టి పి ఎం జి హై స్కూల్ విద్యార్థిని వట్టెం అక్షిత సాధించారు. ఆమె 600కు గాను 592 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థినిని సన్మానించి స్మార్ట్ వాచ్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు, మండల విద్యాశాఖ అధికారి సి హెచ్ రజినీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా పాల్గొన్నారు.

