MachilipatnamLocal News
April 30, 2026
కృష్ణా యూనివర్సిటీ

ప్లాస్టిక్ రహిత క్యాంపస్ గా కృష్ణా యూనివర్సిటీ – వి సి ఆచార్య కె. రాంజీ

  • April 25, 2026
  • 1 min read
[addtoany]
ప్లాస్టిక్ రహిత క్యాంపస్ గా కృష్ణా యూనివర్సిటీ – వి సి ఆచార్య కె. రాంజీ
మచిలీపట్నం : 
 
కృష్ణా విశ్వవిద్యాలయం ను ప్లాస్టిక్ రహిత క్యాంపస్ గా మార్చేందుకు చర్యలు చేపడతామని ఉపకులపతి ఆచార్య కె. రాంజీ ప్రకటించారు. శనివారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, ఇంజనీరింగ్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విభాగం సంయుక్త ఆధ్వర్యములో నిర్వహించిన పచ్చదనం – పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం లో ఏడు ఎన్ ఎస్ ఎస్ యూనిట్లు, ఎన్ సి సి విభాగం తో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రా కార్యక్రమం లో భాగంగా క్రమం తప్పకుండా పచ్చదనం – పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మచిలీపట్నం లో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించారు. 
 
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కిశోర్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛ మచిలీపట్నం సంకల్పంతో స్వచ్ఛ సారథులు సహకారం తో స్వచ్ఛ ఉద్యమం ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ముదిగొండ శాస్త్రి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు దుర్గా ప్రసాద్, కవిత, రంగమణి, గోపి, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ లు, పరీక్షల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *