MachilipatnamLocal News
April 30, 2026
జిల్లా

జనగణన-2027 అవగాహన 5కే రన్

  • April 25, 2026
  • 1 min read
[addtoany]
జనగణన-2027 అవగాహన 5కే రన్
మచిలీపట్నం :
 
భారతదేశ జనగణన–2027 నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మచిలీపట్నంలో శనివారం ప్రత్యేక 5కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా ఇంచార్జి కలెక్టర్ నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు సాగిన ఈ రన్‌లో పాల్గొన్న అధికారులు “జనగణన–దేశాభివృద్ధికి ఆధారం”, “ప్రతి వ్యక్తి నమోదు – దేశ ప్రగతికి దోహదం” వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు.
జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని, సరిగ్గా సమాచారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు సహకారం అందుతుందని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో జనగణనపై స్పష్టత పెరగడంతో పాటు, సామాజిక బాధ్యతపై అవగాహన మరింత బలపడింది.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, ఆర్డీవో సాంబశివరావు, కలెక్టరేట్ ఏవో రాధిక, పిడిసి కలెక్టర్ నిఖిల సింగ్, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు ఎమ్మార్వోలు ఇతర ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *