మచిలీపట్నం నగరంలో ఆర్.పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాధపురం ప్రాంతంలో రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు హల్చల్ చేశారు. మంత్రి నివాసానికి సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలోని హుండీని దొంగలు చోరీ చేసి పరారయ్యారు. రాత్రి వేళలో పోలీసులు సాధారణ బీట్లు నిర్వహించకపోవడం వల్లే ఈ ఘటన సులభంగా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరం నడిబొడ్డులోనే దేవాలయంలో ఇలాంటి దొంగతనం జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలంలో రాత్రి వేళల్లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయని, పోలీసులు సాధారణ బీట్ ను పెంచాలని ప్రజలు కోరారు. చిన్న చిన్న దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభించి, దొంగలను త్వరగా పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.