MachilipatnamLocal News
April 3, 2026
మచిలీపట్నం

జిల్లా కలెక్టర్ చొరవతో ఊహించని రీతిలో పురోగతి: నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు

  • April 1, 2026
  • 1 min read
[addtoany]
జిల్లా కలెక్టర్ చొరవతో ఊహించని రీతిలో పురోగతి: నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు

రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు

 
మచిలీపట్నం :
 
2025 -26 మార్చి 31వ తేదీ నాటికి మునుపెన్నడూ లేని విధంగా కోటి 30 లక్షల రూపాయలు పన్ను వసూలు చేసి నగరపాలక సంస్థ చరిత్ర సృష్టించిందని కమిషనర్ బాపిరాజు తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పన్నువసూలు చేసి చరిత్ర కెక్కిందని, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తీసుకున్న చొరవ వల్ల ఈ ఘనత సాధించామని నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు తెలియజేశారు. 
 
జిల్లా కలెక్టర్ సూచనల ప్రకారం తాను అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు రెవెన్యూ అధికారి వెంకటేష్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బకాయిదారుల నుండి సామరస్యంగా పన్ను వసూలు చేశా మన్నారు. నగర ప్రజల ప్రయోజనార్థం 365 రోజులు పన్ను వసూలు కేంద్రాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిరంతరాయంగా తెరిచి ఉంచడం జరిగిందన్నారు. దీని ఫలితమే పన్ను వసూళ్లలో రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందన్నారు. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిమాండ్ నోటీసులు జనరేట్ చేయడంలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు సర్వీసులు నిలిపి ఉంచడం జరుగుతుందని, ఆరవ తేదీ నుండి పన్ను వసూలు కేంద్రాలు యధావిధిగా తెరిచి ఉంటాయని బాపిరాజు తెలిపారు
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *