MachilipatnamLocal News
May 25, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ పీజీ సెంటర్‌లో “డిప్లమా ఇన్ హాస్పిటాలిటీ & హాస్పిటల్ మేనేజ్‌మెంట్” కోర్సు ప్రారంభం

  • April 2, 2026
  • 1 min read
[addtoany]
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ పీజీ సెంటర్‌లో “డిప్లమా ఇన్ హాస్పిటాలిటీ & హాస్పిటల్ మేనేజ్‌మెంట్” కోర్సు ప్రారంభం
విజయవాడ :
 

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ పీజీ సెంటర్‌లో “డిప్లమా ఇన్ హాస్పిటాలిటీ & హాస్పిటల్ మేనేజ్‌మెంట్” కోర్సును గురువారం అధికారికంగా ప్రారంభించారు.

 
ఈ కార్యక్రమానికి కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కూనన్ రాంజీ  అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రెక్టర్ ప్రొఫెసర్ ఎం.వి. బసవేశ్వర్ రావు, ప్రొఫెసర్ ఉజ్వల్ గటక్ (రాయలసీమ ఫిజియోథెరపీ సెంటర్), ప్రొఫెసర్ సుజిత్ కుమార్ (నేవీ కమాండో),  ఎన్టీఆర్ పీజీ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దిలీప్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
 వైస్ ఛాన్స్లర్  రాంజీ  మాట్లాడుతూ, 2026–27 విద్యా సంవత్సరంనుంచి సమాజానికి అత్యవసరమైన పలు కొత్త కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
 
డిప్లమా కోర్సులు:
హాస్పిటల్ మేనేజ్‌మెంట్,ఫార్మసీ,
అడల్ట్ & కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్,
యోగా ఇన్‌స్ట్రక్టర్ & కౌన్సెలింగ్, మ్యూజిక్, ఏఐ & రోబోటిక్స, లైబ్రరీ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెరైన్ ఎలక్ట్రానిక్స్, సైబర్ క్రైమ్
 
పీజీ డిప్లమా కోర్సులు:
అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్,
బయోటెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్
ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర సైనిక్ బోర్డ్, కేంద్రీయ సైనిక్ బోర్డ్‌లతో భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రొఫెసర్ దిలీప్  తెలిపారు.
 
విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయి. తరగతులు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 9:00 గంటల వరకు నిర్వహించబడతాయి. ప్రతిరోజు 3 గంటలపాటు క్లాసులు ఉంటాయి.
 
డిప్లమా కోర్సుల వ్యవధి: 3 నెలలు
 
పీజీ డిప్లమా కోర్సుల వ్యవధి: 6 నెలలు
 
అర్హులైన అభ్యర్థులు వెంటనే అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *