చల్లపల్లి:
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ జాతీయ కార్యాలయ కార్యదర్శి తొండెపు దశరధ జనార్ధన్ పుట్టినరోజు వేడుకలు బుధవారం చల్లపల్లిలో ఘనంగా నిర్వహించారు.
నారా లోకేష్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, చల్లపల్లి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చల్లపల్లి నిమ్మల తోటలోని సీయోను వృద్ధుల ఆశ్రమంలో టీడీ జనార్ధన్ పుట్టినరోజు పురస్కరించుకుని వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
టీడీ జనార్ధన్ పుట్టినరోజు కేక్ ను ఆశ్రమ నిర్వాహకులు శీలం భాస్కరరావు కట్ చేసి పంచిపెట్టారు. వృద్ధులకు అన్నదానం చేశారు. టీడీ జనార్ధన్ కు వృద్ధులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.