MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

విద్యావెలుగులు పంచిన గురువుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

  • September 5, 2026
  • 0 min read
విద్యావెలుగులు పంచిన గురువుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

పి. రవికుమార్‌కు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ నవీన్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం

మచిలీపట్నం:

గన్నవరం నియోజకవర్గంలోని అజ్జంపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయుడు పి. రవికుమార్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో అందుకున్నారు. శనివారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ నవీన్, కృష్ణాజిల్లా డీఈఓ యు.వి. సుబ్బారావు తదితరుల చేతుల మీదుగా పి. రవికుమార్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించారు.

జ్ఞానదీపం వెలిగించే గురువు మహోన్నతుడు విద్యార్థుల విజయాలకు మార్గదర్శిగా నిలిచే ఉపాధ్యాయుడు ఆదర్శమూర్తి అని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నవీన్ గురువులను ప్రశంసించారు. అంకితభావంతో విద్యాసేవలను అందిస్తూ విద్యార్థులలో ప్రతిభను వెలికితీస్తున్న రవికుమార్ సేవలకు ఈ అవార్డు ఒక గుర్తింపుగా నిలిచిందన్నారు. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తూ, బోధనను కేవలం వృత్తిగా కాకుండా బాధ్యతగా భావిస్తూ రవికుమార్ చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఆయన సేవలు మరెందరో విద్యార్థుల జీవితాల్లో విద్యావెలుగులు నింపాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

మండలంలోని ఉపాధ్యాయులు పి. రవికుమార్‌ను అభినందిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ జిల్లా స్థాయి పురస్కారం ఆయన విద్యా ప్రస్థానంలో మరెన్నో ఉన్నత శిఖరాలకు నాంది కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సైతం అందుకుని అజ్జంపూడి మండలానికి, గన్నవరం నియోజకవర్గానికి మరింత కీర్తి తీసుకురావాలని కోరుకున్నారు. రవికుమార్ జీవితం విద్యావెలుగులతో నిండిపోవాలని, మరెన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆయనను వరించాలని ఉపాధ్యాయులు మనసారా ఆకాంక్షించారు.

About Author

SSN