MachilipatnamLocal News
October 17, 2026
విద్య - ఉపాధి

కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో విసి ప్రొఫెసర్ కె. రాంజీ సమీక్షా సమావేశం

  • October 7, 2026
  • 1 min read
కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో విసి ప్రొఫెసర్ కె. రాంజీ సమీక్షా సమావేశం

మచిలీపట్నం:

కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఉద్యోగ అవకాశాలపై విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె. రాంజీ అధ్యక్షతన వర్సిటీ క్యాంపస్‌లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, కార్యదర్శులు మరియు కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. రాంజీ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మెరుగైన ప్లేస్‌మెంట్స్, క్రమబద్ధమైన అకాడమిక్ క్యాలెండర్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. 

విసి వెల్లడించిన ముఖ్యాంశాలు:

 * ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్: రాష్ట్రంలో ఫలితాల ప్రకటనలో వ్యత్యాసాలు లేకుండా డిసెంబర్ నాటికి ప్రభుత్వం ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్, పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనుందని తెలిపారు. కృష్ణా వర్సిటీ పరిధిలో పరీక్షలు పూర్తయిన 20 నుండి 30 రోజుల్లోనే ఫలితాలు వేగంగా విడుదల చేస్తున్నామని గుర్తుచేశారు.

 * 75% హాజరు తప్పనిసరి: పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 75% హాజరు ఉండాలని స్పష్టం చేశారు. వైద్య కారణాలు/క్రీడలకు 65% వరకు మినహాయింపు ఉంటుందని, 65% కంటే తక్కువ ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ హాల్ టికెట్లు జారీ చేయవద్దని ఆదేశించారు.

 * డేటా సీరియస్‌నెస్: FRS, ఫీజు రీయింబర్స్‌మెంట్ పోర్టల్ మరియు ప్రభుత్వ డాష్‌బోర్డ్‌లలో ప్రతీ విద్యార్థి హాజరు మరియు వివరాలు సమయానికి, పక్కాగా నమోదు చేయాలని యాజమాన్యాలకు తేల్చి చెప్పారు.

 * స్కిల్స్ & ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లు: విద్యార్థులకు 21వ శతాబ్దపు నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల విద్యార్థుల కోసం మోడల్ సెంటర్లను ఏర్పాటు చేసి శనివారాల్లో ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

 * అడ్మిషన్లు & ఎంఓయూలు: నాణ్యమైన విద్య అందించడం ద్వారానె అడ్మిషన్లు పెరుగుతాయని, విద్యార్థులకు నేరుగా శిక్షణ ఇచ్చేందుకు పలు కంపెనీలతో ఎంఓయూలు (MoU) కుదుర్చుకున్నామని తెలిపారు.

విద్యార్థులను క్రమశిక్షణతో చదివిస్తూ, మారుతున్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా వారిని సిద్ధం చేయడమే లక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

About Author

SSN