MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం: మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తుంగల హరిబాబు

  • October 7, 2026
  • 0 min read
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం: మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తుంగల హరిబాబు

మచిలీపట్నం :

న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తుంగల హరిబాబు మాట్లాడుతూ… ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఇప్పటికే రక్షణ చట్టం తెచ్చారని, కూటమి ప్రభుత్వం ఇక్కడ మీనమేషాలు లెక్కించడం సరైనది కాదని విమర్శించారు. కక్షిదారుల గొడవల వల్ల న్యాయవాదులకు ప్రాణరక్షణ కరువైందని, సమస్య జటిలం కాకముందే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, న్యాయశాఖ మంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయవాదుల రక్షణ చట్టంతో పాటు, గత రెండున్నర సంవత్సరాలుగా జూనియర్ న్యాయవాదులకు నిలిచిపోయిన ₹10,000 స్టైఫండ్‌ను తక్షణమే విడుదల చేయాలని తుంగల డిమాండ్ చేశారు. అలాగే న్యాయవాదులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మరియు వృద్ధులైన న్యాయవాదులకు పెన్షన్ సదుపాయాలు కల్పించాలని కోరారు.

ఈ దీక్షా శిబిరంలో సీనియర్ న్యాయవాదులు పుప్పాల వెంకట్రావు, గుండు ప్రకాష్, సంయుక్త కార్యదర్శి గాదే శామ్యూల్, బండి బసవేశ్వర రావు పాల్గొనగా… సంఘ కార్యదర్శి సర్వ లలిత కుమారి, మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, కమ్మిల విజయకుమార్, వైఎస్సార్‌సీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు పల్లపోతు అంకరాజు, రాజ్‌గురు తదితరులు ప్రసంగించి తమ మద్దతు తెలిపారు.

About Author

SSN