MachilipatnamLocal News
June 24, 2026
మచిలీపట్నం

టౌన్ హాల్ ను ఫంక్షన్ హాల్ గా అభివృద్ధి చెయ్యాలి: మంత్రి కొల్లు రవీంద్ర

  • March 7, 2026
  • 1 min read
[addtoany]
టౌన్ హాల్ ను ఫంక్షన్ హాల్ గా అభివృద్ధి చెయ్యాలి: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, 7 మార్చి 2026, SSN:
 
       మచిలీపట్నం లోని 18వ డివిజన్ సచివాలయం వద్ద ఉన్న టౌన్ హాల్‌ను ఆధునీకరించి, మధ్య తరగతి ప్రజలు కూడా అందుబాటులో వాడుకునే విధంగా ఆధునిక ఫంక్షన్ హాల్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. శనివారం ఉదయం టౌన్ హాల్ అభివృద్ధికి సంబంధించి రూపొందించిన నమూనా చిత్రాలను మంత్రి పరిశీలించారు.
       ఈ సందర్భంగా ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ పి. రాధిక , ఈఓ సమ్మెట స్వామి తో మంత్రి చర్చించారు. టౌన్ హాల్‌ను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందించి, పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. 
      పట్టణంలో మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో వేడుకలు నిర్వహించుకునే సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *