MachilipatnamLocal News
July 19, 2026
మచిలీపట్నం

63 అడుగుల సహజ మట్టి గణేశ విగ్రహం, ఉపాలయాల నిర్మాణానికి శంకుస్థాపన

  • July 3, 2026
  • 1 min read
[addtoany]
63 అడుగుల సహజ మట్టి గణేశ విగ్రహం, ఉపాలయాల నిర్మాణానికి శంకుస్థాపన

మచిలీపట్నం:

మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో రానున్న శ్రీ గణేశ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న 63 అడుగుల ఎత్తైన సహజ మట్టి శ్రీ గణేశ మహారాజ్ విగ్రహంతో పాటు పలు ఉపాలయాల నిర్మాణానికి శుక్రవారం ఉదయం రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. అనంతరం ఉత్సవాలకు అవసరమైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు బోర్‌వెల్ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మచిలీపట్నం గత వైభవాన్ని పునరుద్ధరించడంతో పాటు బందరును రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ తీర ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

మంగినపూడి బీచ్ అభివృద్ధితో మచిలీపట్నం అమరావతి గేట్‌వేగా రూపుదిద్దుకోనున్నదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న పోర్టు నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా సాగాలని విఘ్నేశ్వరుని ఆశీస్సులు కోరారు.

63 అడుగుల సహజ మట్టి గణేశ విగ్రహంతో పాటు పలు ఉపాలయాల ఏర్పాటుతో ఈ ఏడాది గణేశ నవరాత్రి ఉత్సవాలను రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి, మాజీ ఎంపీపీ, రూరల్ పార్టీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), బీజేపీ నాయకులు పంతం గజేంద్ర, జనసేన పార్టీ అధ్యక్షుడు గడ్డం రాజు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు పల్లపాటి సుబ్రమణ్యం, అక్కుమంతి రాజా, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

SSN