MachilipatnamLocal News
April 3, 2026
మచిలీపట్నం

రాజధాని చారిత్రాత్మక నిర్ణయం….బీజేపీ నాయకులు

  • April 3, 2026
  • 0 min read
[addtoany]
రాజధాని చారిత్రాత్మక నిర్ణయం….బీజేపీ నాయకులు
మచిలీపట్నం :
 
భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం
రాజధానిగా అమరావతి పై నిర్ణయాన్ని పార్లమెంట్లో ఏకగ్రీవం చేయడాన్ని ‌స్వాగతిస్తూ పట్టణ బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంటు ఉభయ సభలు పూర్తిగా సమర్థిస్తూ ఓటింగ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని కలిగించే ఏకగ్రీవ నిర్ణయాన్ని పార్లమెంటు ఉభయ సభ సభ్యులు తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం పరిపూర్ణ యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుందని నాయకులు పేర్కొన్నారు.
 
ఊరి అందరిదీ ఒక దారిని, ఉలిపి కట్టెది వేరొక దారి లాగా వైసిపి పార్టీ ఒకటే పార్లమెంటు నుండి వాకౌట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల వైసిపి వారికి ఏమాత్రం ఇష్టం లేదని వారిది కపట ప్రేమని , రాష్ట్రాన్ని దోచుకోవడమే వారి లక్ష్యమని రాష్ట్ర ప్రజలు గ్రహించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి పట్ల‌ తీవ్ర వ్యతిరేకతయున్న వైసిపి పార్టీకి రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో ఏ మాత్రం అవకాశం ఇవ్వ రాదని బిజెపి నాయకులు పేర్కొన్నారు కూనప రెడ్డి ట్రస్ట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కూనపరెడ్డి శ్రీనివాస్, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, సూరి శెట్టి హరికృష్ణ, వెన్నాఫణి రాజ్, విన్నకోట సుబ్బారావు, జుజ్జురి ప్రసాదు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *