MachilipatnamLocal News
October 22, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం 30వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి చిలుకోటి ప్రసాద్‌ విజయాన్ని కాంక్షిస్తూ జోరుగా ప్రచారం

  • October 20, 2026
  • 0 min read
మచిలీపట్నం 30వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి చిలుకోటి ప్రసాద్‌ విజయాన్ని కాంక్షిస్తూ జోరుగా ప్రచారం

మచిలీపట్నం:

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరంలో 30వ డివిజన్ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, బరిలోకి దిగిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిలుకోటి ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందే శ్రీరామ్మూర్తి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ మతీన్ పాల్గొని స్థానిక ఓటర్లను కలిశారు. డివిజన్‌లోని వీధుల గుండా పర్యటిస్తూ హస్తం గుర్తుకే ఓటు వేసి, సీనియర్ నాయకుడైన చిలుకోటి ప్రసాద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. స్థానిక ప్రజాసమస్యల పరిష్కారానికి, డివిజన్ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేసే చిలుకోటి ప్రసాద్‌కు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్లు కోకా ఫణిభూషణ్, నల్లబోలు కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొడమంచిలి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు లింగాల సుధాకర్ రావు, ప్రభుదాస్, జి. శంకర్, నల్లబోలు శామ్యూల్, పార్టీ ముఖ్య నాయకులు మరియు స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

SSN