MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

మచిలీపట్నంలో ఘనంగా వాసవి క్లబ్స్ గవర్నర్ విజిట్ – పలు సేవా కార్యక్రమాలు ప్రారంభం

  • August 30, 2026
  • 1 min read
మచిలీపట్నంలో ఘనంగా వాసవి క్లబ్స్ గవర్నర్ విజిట్ – పలు సేవా కార్యక్రమాలు ప్రారంభం

మచిలీపట్నం:

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాష్ ఆదేశాల మేరకు స్థానిక మచిలీపట్నంలోని వాసవి క్లబ్, వాసవి క్లబ్ వనిత సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గవర్నర్ అఫీషియల్ విజిట్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గవర్నర్ మాజేటి హరిప్రసాద్, వారి సతీమణి లక్ష్మీ షర్మిల, వైస్ గవర్నర్ మోటమర్రి గోపాలకృష్ణ, జిల్లా క్యాబినెట్ కార్యదర్శి (సర్వీసెస్) యెండురీ సురేష్, జిల్లా క్యాబినెట్ కోశాధికారి మామిడి కేశవ వెంకట రామారావు, పి.ఆర్.ఓ కందుల సురేష్ హాజరై రెండు క్లబ్‌లను విజిట్ చేశారు.

అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ

కార్యక్రమంలో భాగంగా ముందుగా స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కన్యకా అమ్మవారికి, పార్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోసంఘంలో గరుకు స్తంభాన్ని అందజేశారు.

విరివిగా సేవా కార్యక్రమాలు

అనంతరం అన్నం వీరరాఘవమ్మ – రాఘవరావు కళ్యాణ మండపంలో పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్థానికులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి వైద్య సేవలు అందించారు. మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు, టవళ్లు మరియు చిన్నారులకు కొత్త దుస్తులు, చలివేంద్రం కోసం స్వెట్టర్లు పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు పాఠశాల పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐపిసి శ్రీకాకోళపు రేణుక రాణి, ఐపిసి వేముల నాగ వెంకట శిరీష, ఆర్‌సి అన్నం అశోక్, క్యాబినెట్ అడిషనల్ ట్రెజరర్ జల్లూరి దివ్య శ్రీ, ఆర్‌ఎస్ తునుగుంట్ల రంగనాయకులు, జెడ్‌సి కె.శ్రీదేవి, వాసవి క్లబ్ అధ్యక్షులు దేవత రాఘవేంద్రరావు, కార్యదర్శి జయవరపు ప్రసాద్, వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు రేకపల్లి పూర్ణ షామిలి, కోశాధికారి పొలిశెట్టి శైలజ మరియు ఉభయ క్లబ్‌ల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

SSN