మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రింది కోర్సుల (రెగ్యులర్ & సప్లిమెంటరీ & రీ-వాల్యుయేషన్) ఫలితాలు శుక్రవారం, 10 ఏప్రిల్ 2026 విడుదల చేయబడినట్లు కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కూన రాంజీ, పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి తెలిపారు.
కోర్సుల వివరాలు:
బి.పీ.డి (BPED) & డి.పీ.డి(DPED)-I సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) ఫలితాలు
ఎల్.ఎల్.బి – 111 సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ)
బి.ఏ. ఎల్.ఎల్.బి III/VII సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ)
బి. ఫార్మసీ – III సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ))
ఎం.టెక్ (M.Tech) – 111 సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ
బి.పీ.డి (BPED) & డి.పీ.డి (DPED)-III సెమిస్టర్ (రీ-వాల్యుయేషన్) ఫలితాలు
ఎల్.ఎల్.బి – V సెమిస్టర్ (రీ-వాల్యుయేషన్)
బి.ఏ. ఎల్.ఎల్.బి – IX సెమిస్టర్ (రీ-వాల్యుయేషన్)
ఎల్ఎల్ఎం – III సెమిస్టర్ రీ-వాల్యుయేషన్ (RV) ఫలితాలు
సంబంధిత విద్యార్ధులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చని వారు సూచించారు. పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేయదలచిన విద్యార్థులు 20, ఏప్రిల్ 2026 వరకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పునఃమూల్యాంకనానికి సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ (
www.kru.ac.in) లో పొందు పరిచినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి తెలిపారు.