MachilipatnamLocal News
April 15, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ (యూజి) III, V సెమిస్టర్ పరీక్షల పునర్మూల్యాంకన ( రీవాల్యుయేషన్ ) ఫలితాలు విడుదల

  • March 7, 2026
  • 1 min read
[addtoany]
కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ (యూజి) III, V సెమిస్టర్ పరీక్షల పునర్మూల్యాంకన ( రీవాల్యుయేషన్ ) ఫలితాలు విడుదల
 కృష్ణా యూనివర్సిటీ  పరిధిలో నిర్వహించిన  డిగ్రీ (యూజి) III మరియు V సెమిస్టర్ పరీక్షల పునర్మూల్యాంకన (రీవాల్యుయేషన్) ఫలితాలను విడుదల చేసినట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కూన రాంజీ  తెలిపారు.
       ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ ఉష , పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి వీర బ్రహ్మచారి  మాట్లాడుతూ పునర్మూల్యాంకనకు దరఖాస్తు చేసిన విద్యార్థుల సమాధాన పత్రాలను నిబంధనల ప్రకారం మళ్లీ పరిశీలించి ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పునర్మూల్యాంకన ఫలితాలలో యూజీ III సెమిస్టర్లో 26.96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే యూజీ సెమిస్టర్లో 31.57 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.
        విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను పరిశీలించవచ్చని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *