కరాటే పోటీల్లో నిర్మల పాఠశాల విద్యార్థినికి ప్రథమ బహుమతి
మచిలీపట్నం:
ఆల్ ఇండియా స్థాయి కరాటే పోటీల్లో మచిలీపట్నంలోని నిర్మల పాఠశాల విద్యార్థిని ప్రతిభ చాటి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పాఠశాలలో 6వ తరగతి (‘ఎ’ సెక్షన్) చదువుతున్న చిన్నం నవరత్న జ్యోతి ఈ ఘనత సాధించింది.
6వ ఆల్ ఇండియా ‘మావాటే–కా–షితో ర్యూ ఓపెన్ ఆన్లైన్ కరాటే ఛాంపియన్షిప్–2026’లో భాగంగా నిర్వహించిన సబ్ జూనియర్స్ విభాగంలో (11 ఏళ్ల బాలికల బ్లూ బెల్ట్ కేటగిరీ) నవరత్న జ్యోతి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రథమ బహుమతి గెలుచుకుంది.
జాతీయ స్థాయిలో పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తెచ్చిన విద్యార్థిని నవరత్న జ్యోతిని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి మరెన్నో పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

