MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

దృష్టి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి: సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఎస్ లక్ష్మి

  • October 8, 2026
  • 1 min read
దృష్టి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి: సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఎస్ లక్ష్మి

మచిలీపట్నం:

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాల ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఎస్ లక్ష్మి దృష్టి దినోత్సవ ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం నేత్ర వైద్యురాలు డాక్టర్ అమృత ఆసుపత్రిలోని వార్డులు, బాహ్య రోగుల విభాగంలో (OPD) రోగులకు దృష్టి లోపాలపై అవగాహన కల్పించారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిన్నతనంలోనే పిల్లల్లో కంటి సమస్యలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే వైకల్యాలను నివారించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ జి. భానుమూర్తి, డాక్టర్ శివాని, నేత్ర సహాయక అధికారులు శ్యాంబాబు, ఇబ్రహీం, దృష్టి కొలత నిపుణుడు అన్వేష్ మరియు వైద్య విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN